రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని పలు ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను(Inter examination centers) కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Collector Sandeep Kumar Jha)బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీ డియట్ ఫస్టియర్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా సహస్ర జూనియర్ కళాశాల, సాయి శ్రీ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమె రాలను తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని ఇన్విజిలేటర్లను అడిగి తెలు సుకున్నారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులను సెంటర్లో ఏర్పాటుచేసిన మౌలిక వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.