సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 17: తంగళ్లపల్లి మండల కేంద్రంలో మినీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మండల కేంద్రంలో తాడూరు చౌరస్తాలో భారీ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. లాంగ్ లీవ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. నిండు నూరేళ్లు జీవించాలని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజబింకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగల మానస, మాజీ ఏఎంసీ చైర్మన్ పూసపల్లి సరస్వతి, సింగిల్ విండో చైర్మన్లు బండి దేవదాస్ గౌడ్, కోడూరి భాస్కర్ గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అంకారపు రవీందర్, మాజీ జడ్పీ టీసీ కోడి అంతయ్య, పడి గెల రాజు, జిల్లా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు, వల కొండ వేణుగోపాలరావు, ప్యాక్స్ వైస్ చైర్మన్ వెంకరమణరెడ్డి, బండి జగన్, కోడం సంధ్యారాణి, జక్కుల నాగరాజు యాదవ్, సీనియర్ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు నేతలు ఉన్నారు.