సిరిసిల్ల రూరల్, మార్చి 20: బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఆరు గ్యారంటీల అమలును గాలికి వదిలేశారని తంగళ్ళపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గజాభింకర్ రాజన్న అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నూతన డైరీనీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యుల ప్రజల ఆశలు గల్లంతు చేశారన్నారు. ఇప్పటికే రైతు భరోసాను తగ్గించి, ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పారన్నారు. సిరిసిల్లకు ఇంటిగ్రేటెడ్ స్కూలు ఎందుకు మంజూరు చేయించలేకపోయారని, మంజూరు చేసిన వాటికి బడ్జెట్లో కూడా అరకొర నిధులే వెచ్చించారని విమర్శించారు. దీనిపై ఇక్కడి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, విప్ అది శ్రీనివాస్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఇప్పటికైనా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా నిర్వహించాలన్నారు. ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్ కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసే బడ్జెట్ ప్రవేశపెట్టిందని మండిపడ్డారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి, మాజీ జడ్పీటిసి కోడి అంతయ్య పడిగెల రాజు, బండి జగన్, ఫ్యాక్స్ మాజీ చైర్మన్ ఉమ్మారెడ్డి సత్యనారాయణ రెడ్డి, కోడం సంధ్యారాణి, అనిల్ కుమార్ రెడ్డి, నవీన్ రెడ్డి, గుండు ప్రేమ్ కుమార్, అవధూత మహేందర్, కృష్ణ, మిట్టపల్లి జవహర్ రెడ్డి, శ్రీకాంత్, కుర్మా రాజయ్య, మళ్ళారపు నరేష్, అమర్ రావు ,అనిల్, క్యారం జగత్, దేవయ్య, వెంకట రంగం, భానుమూర్తి పాల్గొన్నారు.