ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఎయిర్టెల్ సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు తిరగబడ్డారు. సెల్ టవర్ జనవాసాల సమీపంలో ఏర్పాటు చేస్తే రేడియేషన్ మూలంగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి కొద్ది దూరంలో సెల్ టవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఎయిర్టెల్ యజమాన్యాన్ని కోరినా వినకుండా తమపై కేసులు కూడా నమోదు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
దీంతో గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనవాసాల మధ్యలో సెల్ టవర్ ఏర్పాటు చేయకుండా తమకు న్యాయం చేసి తమ ఆరోగ్యాలను కాపాడాలని కలెక్టర్‌ను గ్రామ ప్రజలు కోరారు.