Baddenapalli Gurukul | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 23: గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల సిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల ప్రిన్సిపల్ దర్శనాల పద్మ ఒక ప్రకటనలో తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో ఐదవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు ప్రవేశాల కోసం 2026 జనవరి 21 వరకు ఆన్లైన్లో దరాఖస్తు చేసుకునే అవకాశం ఉందని దర్శనాల పద్మ తెలిపారు. ఈ ప్రవేశపరీక్ష 2026 ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థిని,విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉద్దేశంతో గురుకులాలలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.