గంగాధర, మార్చి 18: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను చేపట్టాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు చిలుముల రాజయ్య అన్నారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన దీక్షలో మంగళవారం రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ
చేపట్టకపోవడంతో 70 ఏళ్లుగా ఉద్యోగ నియామకాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.
దేశ అత్యున్నత ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ బలపరుస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేపట్టకుండా మాదిగలకు అన్యాయం చేయడానికి ప్రయత్నించడం దుర్మార్గమని పేర్కొన్నారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తడగొండ శంకర్, గంగాధర రవి, దోమకొండ శ్రీనివాస్, గంగాధర రఘు,ద్యావ శ్రీనివాస్,దోమకొండ అనిల్, దోమకొండ నరేష్,గంగాధర వేణు, గంగాధర శంకర్, బెజ్జంకి ఇసాక్, కళ్లేపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.