Rainbow School | గోదావరిఖని : హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో గోదావరిఖని రెయిన్బో స్కూల్ విద్యార్థిని చేరాల నందననేహా పాల్గొని ప్రతిభను చాటింది. నాట్య ఆచార్య దగ్గుల జ్యోతిర్మయి పర్యవేక్షణలో నందననేహా ఈ కార్యక్రమంలో పాల్గొని గోదావరిఖని ఖ్యాతిని పెంచడంతో పాటు పారిశ్రామిక ప్రాంతానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా రెయిన్బో స్కూల్ కరస్పాండెంట్ పీఎస్ అమరేందర్ విద్యార్థిని నందననేహను అభినందించారు. అలాగే నందనకు శిక్షణ ఇచ్చిన నాట్య ఆచార్య దగ్గుల జ్యోతిర్మయి అమరేందర్ శిష్యులే కావడం విశేషంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నందననేహాకు అభినందనలు తెలియజేశారు.