Vemulawada | జాడ లేని వాన.. పంటను కాపాడేందుకు రైతు భగీరథ యత్నం
వ్యవసాయమే జీవనాధారంగా భావించిన రైతులకు వాన జాడ కరువైంది. వేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు.
- వాటర్ ట్యాంకర్ తో పంట చేనులో పడుతున్న రైతు
Vemulawada | వేములవాడ, జూన్ 27 : వ్యవసాయమే జీవనాధారంగా భావించిన రైతులకు వాన జాడ కరువైంది. వేసిన పంటను కాపాడుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నమే చేస్తున్నారు. వేములవాడ పురపాలక సంఘం పరిధి విలీన గ్రామం అయ్యోరుపల్లి లో ఉల్లెందుల పోచయ్య తనకున్న నాలుగు ఎకరాల్లో మే చివరి వారంలోనే 25వేల రూపాయలు వెచ్చించి పత్తి పంట కోసం విత్తనాలను నాటాడు. వాతావరణంలో విపరీతమైన వేడి, పైగా వర్షాలు కురవకపోవడంతో మొదటిసారి వేసిన విత్తనాలు భూమిలోనే ఎండిపోయాయి. దీంతో చేసేదేమీ లేక రెండోసారి మరో రూ.25 వేల వరకు ఖర్చు చేసి పత్తి విత్తనాలను వేశాడు.
అయినప్పటికీ వర్షాలు లేకపోవడంతో ఇప్పటికే రూ.50వేల వరకు అప్పు చేసి మరి వ్యవసాయం చేస్తుండగా రెండోసారి వేసిన విత్తనాలను దక్కించుకునేందుకు వాటర్ ట్యాంకర్ తో నీటిని కొనుగోలు చేసి మరి కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్ కు రూ.1500 వరకు చెల్లిస్తుండగా మొత్తం నాలుగు ఎకరాలకు ఎనిమిది ట్యాంకర్ల మీరు అవసరమవుతుండగా రూ.12 వేలతో వేసిన విత్తనాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. రైతు పోచయ్య మాట్లాడుతూ వర్షాలు లేక మొదటిసారి వేసిన విత్తనాలు ఎండిపోయాయని తెలిపారు. రెండోసారి కూడా విత్తనాలు వేసిన వర్షాలు లేకపోవడంతో అవి కూడా పాడైపోయే ప్రమాదం ఉందని ట్యాంకర్ ద్వారా పంట కాలువలో నీటి జల్లులను కురిపిస్తూ కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఇప్పటికీ అనేక మంది రైతులు రెండోసారి కూడా విత్తనాలను నాటి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

