వడ్లు వర్షార్పణం
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో నష్టం వాటిల్లుతున్నది. ఆదివారం సాయంత్రం తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల పడిన వానకు..
- సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల వర్షం
- వరుస వర్షాలతో తడిసిముద్దవుతున్న ధాన్యం
- శాపంలా మారిన సర్కారు నిర్లక్ష్యం
- రెండు నెలలైనా కేంద్రాల్లోనే ధాన్యం
ఎల్లారెడ్డిపేట/ వేములవాడరూరల్/ కోనరావుపేట, జూన్ 8: కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారుతున్నది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రెండు నెలలైనా కొనకపోవడంతో ఆరుగాలం కష్టం నీళ్లపాలవుతున్నది. రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలతో నష్టం వాటిల్లుతున్నది. ఆదివారం సాయంత్రం తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల పడిన వానకు.. ఎల్లారెడ్డిపేట మండలం గుండారం, తిమ్మాపూర్, జైసేవాలాల్ తండా, వేములవాడరూరల్ మండలం లింగంపల్లి, వట్టెంల, నూకలమర్రి, కోనరావుపేట మండలం నిజామాబాద్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు తడిశాయి. తూకం వేసిన బస్తాలు కూడా తడిసిపోయాయి. ఇది చూసిన రైతులు కంటతడి పెట్టారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడ్డారు. కేంద్రాలకు వడ్లు తెచ్చి రెండు నెలలు గడిచినా సరిగ్గా కొనకపోవడంతోనే తమకీ దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. రైతులను ఇంతలా గోస పెట్టవద్దని వేడుకున్నారు. కలెక్టర్ చొరవ చూపి కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు.

వడ్లన్నీ తడిసినయి..
నాకు తిమ్మాపూర్ల రెండెకరాల పొలమున్నది. 120 సంచుల వడ్లు ఎల్లితే నెలన్నర కింద కల్లంలనే పోసిన. కొంటం, కొంటమంటుర్రు. ఇప్పటికీ కాంటా పెట్టినోళ్లే లేరు. నిన్న వానగొట్టింది. నీల్లచ్చి కుప్పల చేరి ఒకపక్క మొత్తం తడిసిపాయె. వడ్లన్నీ కాల్వగట్టుకు ఎత్తుతున్నం. ఇప్పుడు మళ్లీ మాశ్చర్ అచ్చేదాక ఆరబెట్టాలి. అంటే మల్ల నాలుగైదు రోజులైతది. ఇంకో పక్క చూస్తే మల్ల మొగులైతంది. ఏం చేసుడో అర్థమైతలేదు. వానకాలం పంటేద్దామంటే ఈ వడ్లే కొనకపాయె. పొద్దుందాక కావలిగాసుడే ఉన్నది. లేట్ చేయకుండా ధాన్యం కొనాలి.
– బీమరి బాలయ్య, రైతు, తిమ్మాపూర్ (ఎల్లారెడ్డిపేట)
నెలన్నరయినా కొంటలేరు
మాది గుండారం. తిమ్మాపూర్ శివారుల మా పొలముంది. ఏప్రిల్ 28న వరి కోసి తిమ్మాపూర్ కేంద్రంలో వంద కింటాల్ల దాకా వడ్లు పోసిన. ఐదు రోజులకే మ్యాచర్గూడా వచ్చింది. ఇగగొంటం, అగగొంటం, ఇంకా సీరియల్ రాలేదనుకుంటా జరుపుతున్నరు. పొల్లుందని చెప్పిర్రు. జాలిపట్టుమంటే పట్టినం. నిన్నన్నుంచి వాన రావట్టె. వడ్లు తడిసినయ్. మల్ల కింది నుంచి ఎత్తుతున్నం. నెలన్నర నుంచి ఇంటికీ, కేంద్రానికే తిరుగుడైతుంది. ఏం మనసుపడ్తలేదు. జెల్ది కొనుడైపోతే ఏమన్నా పనిజేసుకుంటం. ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలె.
– గుంటి పర్వతాలు, రైతు, గుండారం (ఎల్లారెడ్డిపేట)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

