Vemulawada | వేములవాడ, జనవరి 20 : వేములవాడ పట్టణంలోని మార్కండేయ నగర్ భావన ఋషి సమాజ సేవా సంఘం అధ్యక్ష ఎన్నికలు మంగళవారం నిర్వహించగా సాధారణ ఎన్నికలను తలపించాయి. మొత్తం మార్కండేయ నగర్ లో పద్మశాలిలకు 326 ఓట్లు ఉండగా సంఘం అధ్యక్ష స్థానానికి దూస రఘు, మద్దిరాల నరేష్ లు పోటీపడ్డారు.
దీంతో ఎన్నిక అనివార్యం కాగా ఎన్నికల అధికారులుగా బూర సదానందం, జిందం బాలకిషన్, మహేష్, శ్రీనివాసులు వ్యవహరించగా ఓటింగ్ పద్ధతిన ఎన్నిక నిర్వహించారు. మొత్తం 326 ఓట్లకు గాను 257 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇందులో దూస రఘుకు 168, మద్దిరాల నరేష్ కు 89 ఓట్లు రాగా, 79 ఓట్ల రఘు గెలుపొందినట్లు వారు ప్రకటించారు. మాజీ ఆధిక్యంతో కౌన్సిలర్ గూడూరు మధు లక్ష్మీ బలపరిచిన అభ్యర్థి రఘు గెలుపొందడంతో కాలనీలో సంబరాలు నిర్వహించి పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.