శిథిలావస్థకు చేరిన భవనాలు.. ప్రహరీలు లేక ఆవరణలో సంచరించే పశువులు, పందులు.. భయంభయంగా చదువులు.. మూత్రశాలలు లేక బాలికల అవస్థలు.. వంట గది లేక మధ్యాహ్న భోజనం వండేందుకు ఇక్కట్లు.. తాగునీటి వసతి లేక తిప్పలు.. విద్యుత్ సౌకర్యం లేక తరగతి గదుల్లో చీకట్లు.. ఇలా నాడు పాలకుల నిర్లక్ష్యం, వసతుల లేమితో కుదేలైన విద్యారంగం, స్వరాష్ట్రంలో బలోపేతమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో జీవం పోసుకున్నది. కోట్లాది రూపాయల నిధులతో సకల వసతులు సమకూర్చుకొని కార్పొరేట్‌కు దీటుగా తయారైంది. ‘మన ఊరు- మన బడి’తో ఎవరూ ఊహించనంతగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారగా, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నది. ఇంకా ఇంగ్లిష్ మీడియంతోపాటు డిజిటల్ బోధన అందిస్తుండగా, ఏటా ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నది. ఫలితంగా ఏయేటికాయేడు ప్రవేశాల కోసం పోటీ నెలకొంటున్నది. మరోవైపు ఈ తొమ్మిదేండ్ల కాలంలో పెద్ద ఎత్తున గురుకులాలు, కేజీబీవీలు, ఇంటర్, డిగ్రీ గురుకుల కాలేజీలు ఏర్పాటయ్యాయి. జూనియర్, డిగ్రీ కాలేజీల్లోనూ మౌలిక వసతులు సమకూరాయి. కొత్తగా నాలుగు జిల్లాలో వైద్య కళాశాలలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా ఉమ్మడి జిల్లా ఎడ్యుకేషన్ హబ్‌గా మారి, కేజీ టూ పీజీ దాకా ఇక్కడే చదువుకునే అవకాశం ఏర్పడింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవం నిర్వహిస్తుండగా, విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులపై ‘నమస్తే’ కథనం..
– కరీంనగర్, జూన్ 19(నమస్తే తెలంగాణ)
నాటి పాలనలో కుదేలైన విద్యారంగాన్ని రాష్ట్ర సర్కారు బలోపేతం చేసింది. కోట్లాది రూపాయలీతో కార్పొరేట్‌కు దీటుగా మార్చింది. ప్రభుత్వ బడులకు మౌలిక వసతులను సమకూర్చి, కార్పొరేట్‌కు దీటుగా మార్చేందుకు గత విద్యా సంవత్సరం నుంచి ‘మన ఊరు-మన బడి’ని చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో 2,535 పాఠశాలు ఉండగా, అందులో మొదటి విడుత కింద 868 పాఠశాలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం కింద తరగతి గదులు, ప్రహరీలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ వెలుగులు, రసోయిఘర్.. ఇలాంటి సౌకర్యాలను కల్పించే ప్రయత్నాలు మొదలు బెట్టారు. ఈ విద్యా సంవత్సరంలో 270.22 కోట్ల వ్యయంతో ఎంపిక చేసిన 868 పాఠశాలలను సర్వాంగ సుందరంగా మార్చివేస్తున్నారు. దశాబ్దాలుగా మరమ్మతులు లేక పాడుబడినట్లు తయారైన సర్కారు పాఠశాలలు, నేడు ‘మన ఊరు-మన బడి’తో కొత్త రూపు సంతరించుకోగా, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– కరీంనగర్, జూన్ 19 (నమస్తే తెలంగాణ)
గురుకులాలే.. గురుకులాలు
సాధారణ విద్యాలయాలను మెరుగుపర్చి వాటిలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు, కొత్తగా పలు గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ సాంఘిక, మైనార్టీ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలతో పాటు సాధారణ శాఖ ఆధ్వర్యంలోను గురుకుల పాఠశాలలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించింది. నాలుగు శాఖల్లో కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 48 గురుకులాలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ప్రాథమికోన్నత పాఠశాలలుగా ప్రారంభమైన ఈ గురుకులాలు ఏటేటా ఉన్నతీకరణ చేసుకుంటూ ప్రస్తుతం అన్ని జూనియర్ కాలేజీలుగా మారిపోయాయి. ఈ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ఉచిత భోజనం, వసతి, బోధన అన్ని చేయబడుతున్నాయి. ఒక గురుకుల విద్యార్థిపై ఏటా ప్రభుత్వం రూ. 1.25లక్షలను సగటున అంచనా వేస్తున్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా గురుకులాల్లో దాదాపు 17వేల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి లోపు వారు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇక అదే గురుకులాల్లో జూనియర్ కాలేజీ స్థాయిలో చదువుతున్న వారి సంఖ్య మూడువేల వరకు ఉంది…ఇక ఇప్పుడిప్పుడే జిల్లా వ్యాప్తంగా గురుకుల డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో రెండు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో ఒకదాంట్లో 70 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తుండగా, మరో కాలేజీలో రానున్న విద్యా సంవత్సరం నుంచి బోధన ఆరంభం కానుంది.
తలమానికంగా మెడికల్ కాలేజీలు
రాష్ట్రం రాక ముందు ఉమ్మడి జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ లేదు. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర సర్కారు జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసింది. జగిత్యాల మెడికల్ కాలేజీలో 150 సీట్లతో మొదటి విద్యా సంవత్సరం పూర్తయింది. ఇక రామగుండంలోనూ మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరిగాయి. సిరిసిల్ల, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం నాలుగు మెడికల్ కాలేజీల్లో 550 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు రెండువేల కోట్ల వ్యయంతో మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా దవాఖానలు, హాస్టల్స్, ప్రయోగశాలల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తంగా తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉమ్మడి జిల్లా విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
చింతకుంట బడి మారింది
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు- మన బడి’ సర్కారు బడులను పూర్తిగా మార్చి వేస్తున్నది. పాఠశాల్లో మౌలిక వసతులు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం కింద కరీంగనర్‌కు కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి మండలం చింతకుంట పాఠశాలలో వచ్చిన మార్పులే నిదర్శనం. 240 మంది విద్యార్థులు ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 4.44 లక్షల నిధులు కేటాయించింది. ఈ నిధులతో బడికి అవసరమైన విద్యుత్తు వైరింగ్ పునరుద్ధరణ, మూత్రశాలల్లో టైల్స్, కార్యాలయ గదితోపాటు పాఠశాలలో ఉన్న ఐదు తరగతి గదులకు మల్టీ రంగులు వేశారు. పాఠశాల భవనంపై వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. సంప్‌లో మోటరు బిగించారు. ఒకప్పటి చింతకుంట పాఠశాలకు ఇప్పటికి తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. బడి స్వరూపమే మారిపోయింది. ప్రతి పాఠశాలకు అవసరమైన 12 రకాల పనులను ఈ కార్యక్రమం కింద చేపడుతున్నారు. మైనర్, మేజర్ మరమ్మతులు, గ్రీన్ చాక్ బోర్డులు ఏర్పాటు చేయడం, ప్రహరీలు, కిచెన్ షెడ్లు నిర్మించడం, శిథిలమైన తరగతి గదుల స్థానంలో కొత్తవి నిర్మించడం,
ఉన్నత పాఠశాలల్లో అయితే డైనింగ్ హాల్ నిర్మించడం, డిజిటల్ విద్యా భోజనకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. అంతే కాకుండా ఆరుబయట వేసేందుకు నీలం, తెలుపు రంగులను ఎంపిక చేయగా, ప్రహరీలకు సైతం అదే రంగు వేస్తున్నారు. గదుల్లో మార్నింగ్గ్లోరీ, నట్ బ్రౌన్, ఎనామిల్ ఓక్వుడ్, ఎనామిల్ వైల్డ్ మష్రూమ్, మిస్ట్రీవ్యాలీ, ఎనామిల్ ఇండియన్ స్పైస్, కాపర్ కోస్ట్ తదితర రంగులను ఎంపిక చేశారు. అంతే కాకుండా బిల్డింగ్ యూజ్ ఏ లర్నింగ్ ఎయిడ్ కాన్సెప్ట్‌తో పాఠశాలల గోడలపై అందమైన బొమ్మలను చిత్రీకరించనున్నారు. గోడలకు రంగులు వేయడంతోపాటు పాఠ్యాంశ సంబంధమైన పటాలు, చిత్రాలు, అక్షరమాల, ఇతరత్రా బోధనాభ్యసన సామాగ్రి బొమ్మలను వేయనున్నారు. ఉన్నత పాఠశాలల్లో మూత్ర పిండాలు, గుండె, మల్టిపులేషన్ చార్ట్, సౌరకుటుంబం వంటి చిత్రాలు, ప్రాథమిక తరగతుల్లో జంతువులు, రంగులు, తెలుగు, ఆంగ్ల అక్షమాల, పండ్లు, కూరగాయలు, నెలలు, వారాల వంటి ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పించేలా బొమ్మలు వేయనున్నారు. ఇలా పిల్లలను ఆకట్టుకునే విధంగా పాఠశాలలను తీర్చిదిద్దిన తర్వాత దశల వారీగా డిజిటల్ క్లాస్‌లు కూడా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
కాలేజీల్లోనూ వసతుల కల్పన
ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లోనూ రాష్ట్ర సర్కారు మౌలిక వసతులను కల్పించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 56 జూనియర్ కాలేజీలకు సౌకర్యాల కల్పన కోసం నిధులను మంజూరు చేసింది. ప్రతి జూనియర్ కాలేజీలోనూ అదనపు తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించింది. ఇక విద్యాపరమైన విషయాల్లో ప్రతి కాలేజీకి గ్రంథపాలకుడు, క్రీడా ఉపన్యాసకుడి పోస్టులను మంజూరు చేసింది. ప్రతి జూనియర్ కాలేజీకి 2.50లక్షల విలువైన క్రీడా సామగ్రిని కొనుగోలు చేసి అందజేసింది. అలాగే ప్రతి కాలేజీకి 4 లక్షల వ్యయంతో నాలుగు ప్రయోగశాలలతోపాటు రసాయన పరికరాలను సైతం అందించింది. ప్రతి కాలేజీలోనూ ఆన్లైన్ పద్ధతితో హాజరు విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇక డిగ్రీ కాలేజీల్లోనూ పూర్తి సౌకర్యాలు కల్పించారు. క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చి కాలేజీలను సర్క్యూట్లుగా మార్చివేశారు. అలాగే ప్రతి కాలేజీకి టాస్క్ ద్వారా బోధన చేయించి క్యాంపస్ ఇంటర్వ్యూలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇలా డిగ్రీ కాలేజీలను సైతం సంస్కరించారు.
దాదాపు రెండు లక్షల మందికి విద్య
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలో 2,535 పాఠశాలలు ఉండగా, అందులో 1,82,853 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరి చదువుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నది. విద్యార్థులందరికీ సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నది. నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ఉచితంగా పాఠ్యపుస్తకాలను కూడా పంపిణీ చేస్తున్నది. అలాగే ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్‌ను, వాటిని కుట్టించేందుకు అయ్యే కుట్టుకూలి డబ్బులను సైతం అందిస్తున్నది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు నోట్ బుక్స్‌ను సైతం అందించాలని నిర్ణయించింది. 9, 10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం కేంద్రం ఒక్క రూపాయిని ఇవ్వకున్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు చేస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 37,107 మంది విద్యార్థులకు ఉచిత భోజనాన్ని అందిస్తున్నది.
అందుబాటులోకి ఆంగ్ల విద్య
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన అతి కీలకమైన మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించడం. ప్రపంచీకరణ వల్ల నేడు విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం బోధన విద్యార్థులను ఆకర్షించలేకపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడం మొదలైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు మరింతగా రాణించాలన్నా.. పోటీ ప్రపంచంతో పోటీ పడాలన్నా ఆంగ్ల విద్య అవసరమని గుర్తించింది. ఈ మేరకు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు అనుమతించింది. ప్రాథమిక స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా కంపల్సరీ చేస్తూనే ఇంగ్లిష్‌లో బోధనకు అవకాశం ఇవ్వగా, ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి జవసత్వాలు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వం పాఠశాలల్లోనే అందుకు నిదర్శనం. మోడల్ సూల్క్స్, గురుకులాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల బోదన సాగుతున్నది. మొత్తం 1.75లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతున్నది. ఇక కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్‌ల్లోనూ వసతులను మెరుగు పర్చారు. కస్తూర్బా పాఠశాలల స్థాయిని సైతం ఉన్నతీకరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 87 కస్తూర్బా, మోడల్ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య ఏకంగా 35వేల వరకు చేరుకున్నది.
అందుబాటులోకి ఆంగ్ల విద్య
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన అతి కీలకమైన మార్పు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని ప్రారంభించడం. ప్రపంచీకరణ వల్ల నేడు విశ్వమే ఒక కుగ్రామంగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం బోధన విద్యార్థులను ఆకర్షించలేకపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య తగ్గడం మొదలైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు మరింతగా రాణించాలన్నా.. పోటీ ప్రపంచంతో పోటీ పడాలన్నా ఆంగ్ల విద్య అవసరమని గుర్తించింది. ఈ మేరకు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు అనుమతించింది. ప్రాథమిక స్థాయిలో తెలుగును ఒక సబ్జెక్టుగా కంపల్సరీ చేస్తూనే ఇంగ్లిష్‌లో బోధనకు అవకాశం ఇవ్వగా, ప్రభుత్వ పాఠశాలలకు తిరిగి జవసత్వాలు వచ్చాయి. విద్యార్థుల సంఖ్య ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వం పాఠశాలల్లోనే అందుకు నిదర్శనం. మోడల్ సూల్క్స్, గురుకులాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల బోదన సాగుతున్నది. మొత్తం 1.75లక్షల మంది విద్యార్థులకు మేలు జరుగుతున్నది. ఇక కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్‌ల్లోనూ వసతులను మెరుగు పర్చారు. కస్తూర్బా పాఠశాలల స్థాయిని సైతం ఉన్నతీకరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల 87 కస్తూర్బా, మోడల్ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్య ఏకంగా 35వేల వరకు చేరుకున్నది.
ఏటా ఉపకారవేతనాలు
ప్రభుత్వం విద్యార్థులకు ఏటా కోట్లాది రూపాయల ఉపకార వేతనాలను ప్రోత్సాహకంగా అందిస్తున్నది. 2022-23 సంవత్సరానికి సంబంధించి 68 వేల మంది బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాల కింద 56.60 కోట్లు అందించింది. అలాగే 2022-23 సంవత్సరానికి 12 వేల 427 మంది బీసీ విద్యార్థులకు 40.52 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చింది. ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద 20 కోట్ల 52 లక్షల 59 వేల 297 రూపాయలను 1500 మంది విద్యార్థులకు ఖర్చు చేసింది.
నేడు విద్యా దినోత్సవం
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యాదినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యా సంస్థల్లో పతాకాన్ని ఆవిష్కరిస్తారు. తదనంతరం నిర్వహించే సభలో విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. ‘మన ఊరు-మన బడి’ పాఠశాలలను ప్రారంభిస్తారు. 10 వేల గ్రంథాలయాలను, 1600 డిజిటల్ క్లాస్ రూమ్‌లను ప్రారంభిస్తారు. పిల్లలకు పోటీలు నిర్వహిస్తారు.
క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి
ప్రభుత్వ విద్యార్థులకు క్రీడలు, సాంకేతిక నైపుణ్యంపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు నిధులను మంజూరు చేస్తున్నది. గతంలో క్రీడా నిధి కింద, పిల్లల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులతో క్రీడలను నిర్వహించేవారు. అయితే విద్యాహక్కు చట్టంతో పిల్లల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా నిధితో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకూ క్రీడా నిధులను మంజూరు చేసింది. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు ఐదువేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 10వేల చొప్పున 2,535 పాఠశాలలకు క్రీడానిధులను గత విద్యా సంవత్సరం అందించింది. ఈ నిధులతో పాఠశాలల్లో మళ్లీ క్రీడలు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రతి పాఠశాలలోనూ సాంకేతిక పరమైన బోధన సాగించాలనే సంకల్పంతో డిజిటల్ తరగతులను పాఠశాలల్లో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 238 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశారు. మూడు ఎల్ఈడీ స్క్రీన్లు, ట్యూబ్‌లు, జనరేటర్, గ్రీన్బోర్డు, బ్యాటరీతో డిజిటల్ తరగతి గదులు రూపుదిద్దుకున్నాయి. అందు కోసం 15.90 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ఇక పిల్లలు, ఉపాధ్యాయుల హజరుశాతంతోపాటు పాఠశాలల వివరాలు, మధ్యాహ్న భోజన వివరాలు, క్రీడాపరికరాల వివరాలను రోజువారీగా ఆన్లైన్ చేసేందుకు ప్రతి పాఠశాలకు ట్యాబ్‌లను అందజేసింది.
క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి
ప్రభుత్వ విద్యార్థులకు క్రీడలు, సాంకేతిక నైపుణ్యంపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు నిధులను మంజూరు చేస్తున్నది. గతంలో క్రీడా నిధి కింద, పిల్లల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులతో క్రీడలను నిర్వహించేవారు. అయితే విద్యాహక్కు చట్టంతో పిల్లల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడా నిధితో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకూ క్రీడా నిధులను మంజూరు చేసింది. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు ఐదువేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు 10వేల చొప్పున 2,535 పాఠశాలలకు క్రీడానిధులను గత విద్యా సంవత్సరం అందించింది. ఈ నిధులతో పాఠశాలల్లో మళ్లీ క్రీడలు ప్రారంభమయ్యాయి. అలాగే ప్రతి పాఠశాలలోనూ సాంకేతిక పరమైన బోధన సాగించాలనే సంకల్పంతో డిజిటల్ తరగతులను పాఠశాలల్లో ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 238 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేశారు. మూడు ఎల్ఈడీ స్క్రీన్లు, ట్యూబ్‌లు, జనరేటర్, గ్రీన్బోర్డు, బ్యాటరీతో డిజిటల్ తరగతి గదులు రూపుదిద్దుకున్నాయి. అందు కోసం 15.90 కోట్లను ప్రభుత్వం వ్యయం చేసింది. ఇక పిల్లలు, ఉపాధ్యాయుల హజరుశాతంతోపాటు పాఠశాలల వివరాలు, మధ్యాహ్న భోజన వివరాలు, క్రీడాపరికరాల వివరాలను రోజువారీగా ఆన్లైన్ చేసేందుకు ప్రతి పాఠశాలకు ట్యాబ్‌లను అందజేసింది.
పలకతో వచ్చి.. పట్టాతో ఇంటికి
‘మన ఊరు-మనబడి’లో భాగంగా రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్మించారు. పలుకతో వచ్చిన విద్యార్థి పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు ఒకే చోట చదువుకునేలా రాష్ట్రంలోనే ఆదర్శంగా ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ చొరవ మేరకు రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్ స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్ఎఫ్, డివీస్ ల్యాబ్, గివ్ తెలంగాణ, గ్రీన్కో సహకారంతో ఆరెకరాల్లో 3కోట్ల వ్యయంతో విద్యా సముదాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. మొత్తం 70 తరగతి గదుల్లో 3500 మంది తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో అభ్యసించేందుకు ఆధునిక హంగులతో ఎడ్యుకేషన్ హబ్‌లా నిర్మాణాలు పూర్తి చేశారు. 250 మంది చిన్నారులకు సరిపడేలా అంగన్వాడీ కేంద్రం.. చిన్నారులకు ప్రీ ప్రైమరీ, క్రీడా మైదానంతో పాటు ప్రైమరీ, ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలతో పాటు పీజీ కళాశాలకు అనుగుణంగా భవన సముదాయాలు సిద్ధం చేశారు. ప్రాంగణంలో డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం, వెయ్యి మంది ఒకే సారి కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు గత డిసెంబర్లో 6.80 లక్షల వ్యయంతో వెయ్యి లీటర్ల సామర్థ్యమున్న ఆర్వో ప్లాంటును ఏర్పాటు చేశారు. అన్ని వసతులతో వంట గదితో పాటు సామగ్రిని నిల్వ చేసేందుకు ప్రత్యేక గదులను నిర్మించారు. 50 కంప్యూటర్లతో నైపుణ్యాభివృద్ధి శిక్షణకేంద్రం సిద్ధం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో 40వేల చదరపు అడుగుల్లో క్రీడా మైదానాన్ని సిద్ధం చేశారు. అందులోనే క్రికెట్, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ కోర్టులతో పాటు అథ్లెటిక్ ట్రాక్‌తో కూడిన ఎఫ్ఐఎఫ్ఏ స్టాండర్డ్ ఆస్ట్రో టర్ఫ్ ప్లే మైదానంగా తీర్చిదిద్దారు. ఈ విద్యాలయాన్ని గత ఫిబ్రవరి ఒకటిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఇంగ్లిష్ మీడియం నాకు నమ్మకాన్ని ఇచ్చింది
నేను జగిత్యాల పురాతన ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదివాను. మొదట్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడాన్ని అందరూ తప్పుపట్టారు. కొందరు జాలిగా చూశారు. అయితే గవర్నమెంట్ స్కూలుకు వచ్చాకే నాకు తెలిసింది ఇక్కడ కూడా మంచిగా చదువు చెబుతారని. నా కంటే ముందు చదివన వారు తెలుగు మీడియంలో చదివారట. కానీ, నేను మాత్రం ఇంగ్లిష్ మీడియంలో చేరిన. దీని వల్ల మేలు జరిగింది. టీచర్స్ ప్రోత్సాహంతో ఇంగ్లిష్ చదవడం నాకు పెద్ద కష్టం కాలేదు. ముఖ్యంగా సైన్స్‌పైన ఇష్టం పెరిగింది. ఎన్నోసార్లు సైన్స్ ఎగ్జిబిషన్లకు సైతం నేను నా ప్రయోగాలతో వెళ్లి ప్రదర్శనలు ఇచ్చా. ఇంగ్లిష్ రావడంతో ప్రజంటేషన్ ప్రాబ్లం కాలేదు. అది నాలో మరింత నమ్మకాన్ని కలిగించింది. నేషనల్ సైన్స్‌ఫేర్‌లో ప్రైజ్ రావడంతో మా ఫిజిక్స్ సార్ ఆనందరావు ల్యాప్‌ట్యాప్ గిఫ్ట్ ఇచ్చారు. పదో తరగతి తర్వాత పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ అయిన ఈఈఈలో చేరా. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇంగ్లిష్ మీడియంలో చదవడం వల్ల నాకు పెద్దగా డిప్లొమా ఇబ్బందికావడం లేదు. గవర్నమెంట్ ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. నాలాంటి మధ్యతరగతి వారికి పెద్దగా ఖర్చు పెట్టకుండానే నాణ్యమైన విద్య అందింది.
– బండివార్ సాయిక్రిష్ణ, ఈఈఈ పాలిటెక్నిక్ విద్యార్థి (అగ్రహారం)
గురుకుల విద్యార్థి భేష్
ఓదెలకు చెందిన గోశెట్టి చంద్రమౌళి-లలిత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తారు. వీరికి కొడుకు శ్రావణ్, కూతురు ఐశ్వర్య ఉన్నారు. శ్రావణ్ ఒకటో తరగతి నుంచి నాలుగో తరగతి వరకు ఓదెలలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత పెద్దపల్లిలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశ పరీక్ష రాసి, సీటు సాధించాడు. 5వ తరగతి నుంచి హాస్టల్లో ఉంటూ 2002-2023 విద్యాసంవత్సరంలో పదో తరగతి పూర్తి చేశాడు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే శ్రావణ్, పదో తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సంపాదించాడు. 9.5 జీపీఏ సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచాడు. పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్లు, గ్రామస్తులు శ్రావణ్‌ను అభినందించారు. గురుకుల పాఠశాలలో చదవి ఉత్తమ ప్రతిభ కనబర్చిన శ్రావణ్‌ను పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్లో సన్మానించనున్నారు. శ్రావణ్ తాను భవిష్యత్‌లో ఉన్నత చదువులు చదివి ఐఏఎస్ ఆఫీసర్ కావాడమే తన లక్ష్యమని తెలిపాడు.