Collector Satyaprasad | విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Collector Satyaprasad | జగిత్యాల పట్టణంలోని పురాతన పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం సందర్శించారు.
జగిత్యాల : జగిత్యాల ( Jagtial ) పట్టణంలోని పురాతన పాఠశాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ( Collector B. Satyaprasad ) శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని ( Mid day Meals ) పరిశీలించి, భోజన నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, రుచిపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భోజనం సక్రమంగా, సమయానికి అందుతున్నదా అనే అంశాన్ని కూడా పరిశీలించారు .

డైట్ మెను, వంటగది పరిశుభ్రత, నీటి వినియోగం, నిల్వ, కిచెన్ షెడ్ను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా పోషకాహారం సమృద్ధిగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూను ఖచ్చితంగా అమలు చేసి, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పరిశుభ్రత ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాధికారి కె. రాము, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, పాఠశాల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

