Peddapally | పెద్దపల్లిరూరల్, మే – 12: రైతులు పండించి అమ్మకానికి తెచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డీ వేణు అన్నారు. పెద్దపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. మండలంలోని పెద్దకల్వల, ములసాల గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న టార్ఫాలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
అ నంతరం ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతంరైతులు పండించి అమ్మకానికి తెచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డీ వేణు అన్నారు. పెద్దపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. రాగానే తూకం వేసి మద్దతు ధరకు కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యానికి సంబంధించిన మద్దతు ధర, సన్న రకం ధాన్యానికి బోనస్ డబ్బులు రైతులకు సకాలంలో జమ అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు రైతుల వద్ద నుంచి 438 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి రూ. 304 కోట్ల చెల్లింపులు చేయడం జరిగిందన్నారు. పెద్దపల్లి మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని, రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడా లేదని అదనపు కలెక్టర్ తెలిపారు.
ప్రతీ రోజు జిల్లాలో ఖచ్చితంగా 15 నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హామాలీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.