Python | వీణవంక , జనవరి 2 : వీణవంక మండలం బ్రాహ్మణపల్లి శివారులోని పెద్ద మోరీ సమీపాన ఓ రైతు పంట పొలంలో 6 ఫీట్ల పొడవు గల కొండచిలువ కలకలం సృష్టించింది. రైతులు పంట పొలాల్లో బిజీగా ఉన్న సమయంలో ఓడ్లు చెక్కుతుండగా ఒక్కసారిగా పార కొండచిలువపై పడింది. దానిని చూసిన రైతు చాకచక్యంగా కొండచిలువ అని భావించి, వెంటనే సమీపంలోని రైతులకు తెలియజేసి, రోడ్డుపై వేశాడు.
రైతు మాట్లాడుతూ… పొలంలో ఓడ్లు చెక్కుతుండగా ఒడ్డు వెంట ఉన్న కొండచిలువ పారతో ఒడ్డును చెక్కుతుండగా, ఒకసారి బయటకు వచ్చిందని, దాన్ని గమనించి వెంటనే రోడ్డుపై వేయడం జరిగిందని, అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొండచిలువలు చెరువుల్లో చేరి, రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు.