కమాన్చౌరస్తా, మార్చి 31 : బహుభాషా కోవిదుడు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ‘భారతరత్న’ ప్రకటించగా, శనివారం ఢిల్లీలో పీవీ కుటుంబ సభ్యులు పురస్కారం అందుకున్నారు. ఈ క్రమంలో వారు తిరిగి హైదరాబాద్కు చేరుకున్న సందర్భంగా ఆదివారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో పీవీ కూతురు ఎమ్మెల్సీ సురభి వాణీదేవికి ఘనస్వాగతం పలికారు.
ఇందులో భాగంగా బ్రాహ్మణ సంఘాల ఐక్యవేదిక తరఫున ఘనంగా సత్కరించారు. ఇక్కడ బ్రాహ్మణ ఐక్యవేదిక నాయకులు ప్రమోద్ కోటార్, మంగు రాఘవరావు, టీబీఎస్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మునిపల్లె శ్రీనివాస్, బ్రాహ్మణ సంఘాల నాయకులు ఉన్నారు.