Purchasing centers | పెద్దపల్లి రూరల్, నవంబర్ 8: ఆరుగాలం కష్టపడి పండించిన వరిదాన్యానికి మద్దతు ధర కల్పించడం కోసమే ప్రాథమిక సహకార సంఘాల ద్వారా ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు అప్పన్నపేట సింగిల్ విండో చైర్మన్ చింతపండు సంపత్ అన్నారు. పెద్దపల్లి మండలంలోని అప్పన్నపేట సింగిల్ విండో పరిధిలో గల పాలితం, కాసులపల్లి, గోపయ్యపల్లి, కాపులపల్లి, కనగర్తి, రాగినేడు, బ్రాహ్మణపల్లి, రాఘవాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం సంబంధిత అధికారులు డైరెక్టర్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధరకల్పించడంతో పాటు మద్యదళారి వ్యవస్థను నిర్మూలించేందుకే సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలని వాటిని వినియోగించుకోవాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో సీఈవో గడ్డి తిరుపతి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, డైరెక్టర్లు తాడిచెట్టి సదయ్య, గండు వెంకన్న, సోమ చంద్రయ్య, గోపు శ్రీనివాస్ లతో పాటు పలువురు రైతులు నాయకులు పాల్గొన్నారు.