PACS Purchase centers | పెద్దపల్లి రూరల్, నవంబర్ : రైతులు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే సందర్భంలో దళారి వ్యవస్థను నిర్మూలించేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి సింగిల్ విండో (పీఏసీఎస్) చైర్మన్ మాదిరెడ్ఢి నర్సింహరెడ్డి అన్నారు. పెద్దపల్లి సింగిల్ విండో పరిధిలోని మారేడుగొండ, గుర్రాంపల్లి, మూలసాల, నిమ్మనపల్లి, నిట్టూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శనివారం సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు అమ్ముకునేలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో మెట్టు మదన్ మోహన్, నాయకులు, మాదారపు ఆంజనేయరావు, అశోక్ యాదవ్, దొంత రాజయ్య, గిర్నేని సంపత్ రావు, పలువురు నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.