కొత్తపల్లి, ఆగస్టు 9: కరీంనగర్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలోనే ముం దంజలో నిలుపుతున్న మంత్రి గంగుల కమలాకర్‌కు నియోజకవర్గ ప్రజలు జై కొడుతున్నారు. మరోసారి గెలిపించుకుంటామని ముక్తకంఠంతో చెబుతున్నారు. మూడుసార్లు గెలిచి ఓటమెరుగని నేతగా పేరుగాంచిన ఆయన, నాలుగోసారి విజ యం సాధించాలనే ఆకాంక్షతో బుధవారం కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామస్తులు, మారెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్ ఆధ్వర్యంలో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి క్షేత్రంలో దీక్షా కం కణధారులయ్యారు. స్వామివారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించారు. నియోజకవర్గ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే గంగుల, మరోసారి అ ద్భుత విజయం సాధించాలని వేడుకున్నారు. గం గుల ఎమ్మెల్యే కావడం, మంత్రిగా ఉండడం అదృష్టమని, మళ్లీ తిరిగి ఆయనను తిరుగులేనిమెజార్టీ తో గెలిపించుకుంటామంటూ ప్రమాణం చేశారు. ‘మా గ్రామంలోని ఓట్లన్నీ కమలాకరన్నకేనం టూ’ తీర్మానించారు. ‘కరీంనగర్‌ను అభివృద్ధి చేసి న ఘనత మీదేనని, మళ్లీ మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదేనని స్పష్టం చేశారు. నగరంలోనే కాదు నియోజకవర్గ నలుమూలలా మట్టి రోడ్డు అ నేదే లేకుండా చేశారని కొనియాడారు. కాగా, బద్దిపల్లి వాసుల తీర్మానానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది.