Siricilla | రుద్రంగి, జూలై 11: రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడం అభినందనీయమని మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకల తిరుపతి అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ఇందిరాచౌక్‌లో సీఏం రెవంత్‌రెడ్డి, మంత్రి పొన్న ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చిత్ర పటాలకు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మెన్ చెలుకల తిరుపతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం ప్రభుత్వం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, నాయకులు ఎర్రం గంగ నర్సయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రె మనోహర్, కొమురె శంకర్, లచ్చిరెడ్డి, సామ మోహన్‌రెడ్డి, తూం జలపతి, అభిలాష్, యాదయ్య, దాసరి గంగారాజం, గండి నారాయణ, పల్లి గంగాధర్, లింగం, శ్రీనివాస్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.