Best Available pending dues | పెద్దపల్లి టౌన్, జూన్ 19 : పెద్దపల్లి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని sfi, kvps నాయకులు డిమాండ్ చేశారు. ఆయా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట గురువారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు ప్రశాంత్ అశోక్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎస్సీలు 19000, ఎస్టీలు 6000 మంది విద్యార్థులు వివిధ ప్రవేట్ పాఠశాలల్లో చదువుతున్నారని, పెండింగ్ బిల్లులు ప్రైవేట్ స్కూళ్లకు రాక విద్యాసంస్థలు ప్రారంభంగాను కాగానే విద్యార్థులను పుస్తకాలు తీసుకోవాలని, ఫీజులు మీరే కట్టాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు.
ప్రైవేట్ స్కూళ్లకు పాత బకాయిలు చెల్లించినట్లయితే 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశం కలుగుతుందని దీన్ని ప్రభుత్వం గుర్తించి పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బెస్ట్ అవైలబుల్ విద్యార్థుల తల్లిదండ్రులు మోదంపల్లి శ్రావణ్, సూరజ్, శ్రావణ్, వినోద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.