Godavarikhani | ఫర్టిలైజర్ సిటీ, అక్టోబర్ 6: గోదావరిఖనికి చెందిన న్యాయవాది గూళ్ల రమేష్‌పై దాడి జరిగిన సంఘటనకు నిరసనగా సోమవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం న్యాయవాదులు కోర్టు నుంచి ప్రధాన చౌరస్తా వరకు నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ నిత్యం న్యాయం కోసం పరితపించే న్యాయవాదులపై పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో బీరు సీసాలతో దాడి చేయడం దారుణమన్నారు. రోజు రోజుకు న్యాయవాదులపై దాడులు పెరిగి పోతున్నాయని దాడులకు పాల్పడ్డ నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తౌటం సతీష్, సంయుక్త కార్యదర్శి ముచ్చకుర్తి కుమార్ , క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షుడు దేశెట్టి అంజయ్య, సీనియర్ కార్యవర్గ సభ్యులు పంగ శంకర్, కార్యవర్గ సభ్యులు పులిపాక రాజ్ కుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు బల్మూరి అమరేందర్ రావు, మేడ చక్రపాణి, చందాల శైలజ, పెట్టం శ్రీనివాస్ , గోశిక ప్రకాష్ , కోసన శ్రీనివాస్ రావు, వేల్పుల అరుణ్ కుమార్ యాదవ్, అవినాష్, వెంకటేష్, సుజాత, రేష్మ, తిలక్ తదితరులు న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.