Vemulawada | వేములవాడ, ఏప్రిల్ 02 : సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థను ప్రభుత్వం రద్దు చేయడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు సూచనతో ఎక్కడికక్కడ గ్రామసభలలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు గ్రామాల్లో వినతి పత్రాలు అందజేస్తున్నారు. సెస్ విద్యుత్ సంస్థను రద్దు చేసి ఎన్పీడీసీఎల్ లో చేయడాన్ని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున నిరసన కొనసాగుతుంది.
1960లో సిరిసిల్ల ప్రాంతంలో రైతులు, ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిన సిరిసిల్ల సేస్ సహకార సంఘం సంస్థ రైతులకు ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు చెందిన సహకార సంస్థను రద్దు చేసి ఎన్డీపీసీఎల్ లో కలపడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నియోజకవర్గంలోని పలు గ్రామపంచాయతీలలో పాలకవర్గాలు ప్రత్యేక అధికారులకు వినతి పత్రాలు అందజేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఇప్పటికే వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టాన, చంద్రగిరి, రుద్రవరం గ్రామాలతో పాటు రుద్రంగి చందుర్తి కోనరావుపేట మండలాల్లోని పలు గ్రామాల్లో అభ్యంతర వ్యక్తం చేస్తూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. సెస్ రద్దు చేసి విలీనం చేసే ప్రక్రియను విరమించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.