నగరంలో ప్రాపర్టీ షో నేడు, రేపు నిర్వహణ
మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. రెవెన్యూ గార్డెన్స్ వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నది.
కార్పొరేషన్, ఫిబ్రవరి 8 : మన కరీంనగర్లో నేడు ప్రాపర్టీ షో ప్రారంభం కాబోతున్నది. రెవెన్యూ గార్డెన్స్ వేదికగా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టు డే’ సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహించనున్నది. శుక్రవారం ఉదయం 10గంటలకు ప్రారంభమై శనివారం రాత్రి 7గంటల వరకు కొనసాగనుండగా, అందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్, రుణాలు ఇచ్చే సంస్థలు పాల్గొని, స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. కొత్తగా ఏర్పాటవుతున్న వెంచర్లు, అపార్ట్మెంట్లు, రెడీమేడ్ ఇండ్లు, ఆధునిక నిర్మాణాలకు అయ్యే వ్యయం, బ్యాంకు రుణాలు, నిర్మాణ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకే వేదికపై తెలుసుకోవచ్చు. సందర్శకులందరికీ ప్రవేశం ఉచితం.
సకల వసతులతో నిర్మాణాలు
కరీంనగర్‌లోనే సకల వసతులతో అపార్ట్మెంట్లను నిర్మించి అందుబాటులో తీసుకువచ్చాం. కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నాం. వీటితోపాటు పార్కింగ్‌కు ఎక్కడ ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా నిర్మాణాలు చేస్తున్నాం. కొనుగోలుదారుల ఆసక్తి మేరకు వావిలాలపల్లిలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నాం. మేం చేపట్టిన నిర్మాణాలకు ప్రభుత్వం నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకొని కొనుగోలుదారులకు అందిస్తున్నాం.
-ఉప్పులూరి కృష్ణమూర్తి, ఎడ్వెన్సా సెంచరీ ఈపీసీ ప్రైవేట్ లిమిటెడ్
అత్యాధునిక సౌకర్యాలను అందిస్తున్నాం
హైదరాబాద్‌లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో అందించే అత్యాధునిక సౌకర్యాలతో కరీంనగర్లో విల్లాలను నిర్మిస్తున్నాం. నగరానికి సమీపంలోని మల్కాపూర్, నగునూర్ ప్రాంతాల్లో విల్లాలు, అలకపురిలో అపార్ట్మెంట్లను నిర్మిస్తున్నాం. మారుతున్న పరిస్థితులు, కొనుగోలుదారుల ఆసక్తికి అనుగుణంగా సకల సదుపాయాలను కల్పిస్తున్నాం. అలకాపురిలోని అపార్ట్మెంట్ల నిర్మాణాన్ని ఈ ఏప్రిల్‌లోగా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తాం. మేం చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపడుతున్నాం. ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ ప్రాజెక్టులను రూపొందించాం.
– దీలిప్‌కుమార్ మోట్వాని, రాయ్‌చందని సింధ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

