పెద్దపల్లి : ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పదోన్నతులతో ( Promotions ) బాధ్యత మరింత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ( CP Amber Kishore Jha ) అన్నారు. ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తూ ఎస్సైలుగా పదోన్నతి పొందిన ఎ.సత్తయ్య, పి.వెంకన్న గౌడ్, ఎం.ఎ.హబీబ్ గురువారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసే పోలీసు శాఖలో పదోన్నతి పొందిన ప్రతి పోలీసు అధికారిపై బాధ్యత మరింత పెరుగు తుందన్నారు. అప్పగించిన విధులను సమర్థవంతంగా, నిజాయితీతో, నిబద్ధతతో నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వారి భుజాలపై పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందడం ప్రతి ఉద్యోగికి గర్వకారణమని పేర్కొన్నారు.