Jagitial Collector Satyaprasad | కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలి.. జగిత్యాల కలెక్టర్ కలెక్టర్ సత్యప్రసాద్
రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
Jagitial Collector Satyaprasad | సారంగాపూర్, మే 18 : రైతులకు ఇబ్బందులు కాకుండా ధాన్యం కొనుగోళ్లలో వేగవంతం చేసి కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. బీర్ పూర్ మండలంలోని చర్లపల్లి, కందెనకుంట, తుంగూర్, నర్సింహులపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీలు చేసి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం తూకం, నిల్వ, రవాణ ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలను అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
ఆయా సెంటర్లలో కొనుగోళ్లలో జాప్యం చేయకుండా ధాన్యం వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డాటా ఎంట్రి ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యో విధంగా చూడాలన్నారు. మల్లుల వద్ద దాన్యం త్వరగా ఆన్లోడ్ అయ్యో విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకుని పొడిని ప్రొటెక్ట్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ జితేంద రెడ్డి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేష్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ, ఐకేపీ, సహకార సంఘ అధికారులు, నిర్వహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

