Prize distribution | చిగురుమామిడి, సెప్టెంబర్ 25 : చిగురుమామిడి మండల కేంద్రం లోని మండల పరిషత్ కార్యాల ఆవరణలో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న బతుకమ్మలకు బహుమతులను అందజేశారు. ఎంపీడీవో మధుసూదన్ సూపరింటెండెంట్ ఖాజామోహినుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు విశేష స్పందన లభించింది. వివిధ శాఖల మహిళా అధికారులు బతుకమ్మలతో తరలివచ్చారు. బతుకమ్మ ప్రాసస్యాన్ని గొప్పతనాన్ని కీర్తిస్తూ వివరించారు.
న్యాయ నిర్ణీతగా చిగురుమామిడి మాజీ ఎంపీటీసీ గూడెం లక్ష్మి వ్యవహరించగా, మొదటి బహుమతిగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మకు, రెండో బహుమతిగా ఉదయలక్ష్మి మండల సమాఖ్య (సెర్ప్) మహిళలకు, మూడో బహుమతిగా తహసీల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలోని బతుకమ్మకు, కాన్సిలేషన్ బహుమతిగా మిగతా పోటీలో ఉన్న బతుకమ్మలకు జ్ఞాపికలను, బహుమతులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఖాజామోహినుద్దీన్ పాటు డిప్యూటీ తహసీల్దార్ స్వరూప రాణి, మండల వ్యవసాయ అధికారి రమ్యశ్రీ, ఐకేపీ(సెర్ప్) ఏపీఎం మండల రజిత, ఏఈఓ అఖిల, జూనియర్ అసిస్టెంట్ స్వరూప రాణి, పంచాయతీ కార్యదర్శులు, రెవిన్యూ మహిళా ఉద్యోగుల తోపాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.