Priya Milk Parlour | వీణవంక, సెప్టెంబర్ 8 : వీణవంక మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో సోమవారం ప్రియ మిల్క్ పార్లర్ ను ప్రియ మిల్క్ సేల్స్ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింగరావు ,కరీంనగర్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు పాలు, పాలతో తయారైన ప్రొడక్ట్స్ అందుబాటులోకి తీసుకురావడం హర్షించదగిన విషయమన్నారు.
గత 20 సంవత్సరాల నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో సేవలందిస్తుందని, ప్రియా మిల్క్ పార్లర్ వారు ఇంకా ఇలాంటి సంస్థలు ప్రతీ పల్లెల్లో విస్తరించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. అనంతరం ప్రియ మిల్క్ పార్లర్ యజమాని బత్తిని నరేష్ దంపతులు ముఖ్య అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి, మాజీ జెడ్పీటీసీ దాసారపు ప్రభాకర్, నర్సింగాపూర్ మాజీ సర్పంచ్ గంగాడి సౌజన్య తిరుపతిరెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శి నరసింహ రాజు, బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, మదన్మోహన్ రెడ్డి, రవీందర్, కొమురయ్య, వెంకటేష్, వినోద్, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు.