మన నేతన్నకు జాతీయ ఖ్యాతి
దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావించడంతో సిరిసిల్ల నేతన్నల ఖ్యాతి దేశవ్యాప్తమైంది.
- జీ20లోగో తయారీపై మన్‌కీ బాత్‌లో ప్రస్తావించిన ప్రధాని మోదీ
- హర్షం వ్యక్తం చేసిన హరిప్రసాద్
సిరిసిల్ల టౌన్, నవంబర్ 27: దేశ ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పేరును ప్రస్తావించడంతో సిరిసిల్ల నేతన్నల ఖ్యాతి దేశవ్యాప్తమైంది. ప్రధాని మోదీ జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించిన సందర్భంగా హరిప్రసాద్ మూడు రోజుల పాటు శ్రమించి మగ్గంపై జీ-20లోగోతో ప్రత్యేక వస్ర్తాన్ని త యారు చేశాడు. ఈ వస్ర్తాన్ని స్థానిక నాయకుల ద్వారా ప్రధాని మోదీకి పంపగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ తెలంగాణ పేరు తో పాటు హరిప్రసాద్ తయారు చేసిన జీ-20లోగో గురించి ప్రస్తావిస్తూ అతడిపై ప్రశంసలు కురిపించాడు. దీంతో హరిప్రసాద్‌కు స్థానికుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి.
సంతోషంగా ఉంది
ప్రధాని మోదీ జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించడం గర్వకారణం. ఈ సందర్భంగా జీ-20లోగోతో ఉన్న ప్రత్యేక వస్ర్తాన్ని తయారు చేసి ప్రధానికి పంపించాను. మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణతో పాటు నా పేరును ప్రధాని ప్రస్తావించడం చాలా గర్వంగా ఉంది. ఇదే స్పూర్తితో మరిన్ని చేనేత కళలను రూపొందించి సిరిసిల్ల పేరును నిలబెడతా.
– హరిప్రసాద్, చేనేత కళాకారుడు, సిరిసిల్ల
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

