Chigurumamidi | చిగురుమామిడి ఆగస్టు 24 : చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, ప్రభుత్వ విధానాలను విమర్శించడం, శాంతియుతంగా నిరసన తెలియజేయడం ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య హక్కు అని అన్నారు.
మండలంలో మంత్రి పర్యటన ఉన్న సందర్భంలో ప్రతీసారి బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ముందస్తు అరెస్టులతో ప్రజల గొంతును అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ప్రభుత్వం పోలీసులు ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని వారు కోరారు.