కొత్తపల్లి, జనవరి 27 : కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు శనివారం రాత్రి ఉత్సాహంగా సాగాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విశిష్ఠ అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రెండు బస్సులు, ఏసీ, జనరేటర్ సౌకర్యం కల్పించాలని అధికారులతో కలిసి విద్యార్థులు మంత్రి పొన్నంకు వినతిపత్రం అందించారు. స్వతహాగా డాక్టర్ అయిన కవ్వంపల్లి సత్యనారాయణకు మెడికల్ కాలేజీ ఇబ్బందులను పరిష్కరించే బాధ్యతను అప్పగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శీల లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు.