కొత్తపల్లి, డిసెంబర్ 17 : వంతెనల నిర్మాణంతో చారిత్రకంగా ప్రసిద్ధి గాంచిన ఎలగందుల గ్రామానికి పూర్వ వైభవం వస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం రూ. 90 కోట్లతో బ్రిడ్జిలు, రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయ సమీపం నుంచి కాళీకామాత టెంపుల్ వరకు రూ 15 లక్షలతో సీసీ రోడ్డు పనులు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టిందని చెప్పారు. ఎలగందుల పాత రోడ్డు నిర్మాణంతో గ్రామస్తుల ఏండ్ల నాటి కల నెరవేరుతుండడం సంతోషంగా ఉందన్నారు. పనులు పూర్తయితే కరీంనగర్ మీదుగా పద్మానగర్, చింతకుంట, ఎలగందుల నుంచి సిరిసిల్ల వరకు అద్భుతమైన రోడ్డు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఎలగందుల చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన గ్రామం కావడంతో తనతో పాటు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి నిధుల కోసం సీఎం కేసీఆర్ అడగ్గానే రూ 60 కోట్లు మంజూరు చేశారన్నారు.
పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ కరోనాతో చనిపోవడంతో పనులు అర్ధాంతరంగా అగిపోయాయని, నిర్వహణ ఖర్చులు పెరగడంతో అదనంగా రూ 30 కోట్లతో మొత్తంగా రూ 90 కోట్లతో ఈ పనులు ప్రారంభించుకున్నామన్నారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 24 గంటలు పనిచేసి 6 నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిధులకు ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. మానేరు బ్యాక్ వాటర్‌తో ఏడాది పొడుగునా నీరు అందుబాటులో ఉంటు ందని, బ్రిడ్జిలు నిర్మించే ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధ్ది చేసేందుకు సుందరమైన ఐలాండ్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నిధులిచ్చిన సీఎం కేసీఆర్‌కు గ్రామ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్‌కు అన్ని వైపులా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్‌ఫ్రంట్, ఎలగందుల పాత రోడ్డు పుననిర్మాణంతో జిల్లా పర్యాటక శోభను సంతరించుకుంటుందని చెప్పారు. అభివృద్ధితో పాటు వనరులు అందుబాటులో ఉండడంతో ఎలగందులలో రూ. లక్ష పలికే భూములు నేడు రూ కోటి ఇచ్చిన దొరకని పరిస్థితికి చేరాయన్నారు.
కొత్తపల్లి మండలం ఆసీఫ్‌నగర్, చింతకుంట, ఎలగందుల, ఖాజీపూర్, మల్కాపూర్‌లో పంచాయతీ భవనాల కోసం నిధులు మంజూరయ్యాయని, తర్వలోనే ప్రారంభిస్తామని చెప్పారు. అంతకుముందు ఎంపీటీసీ మంద రమేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. గ్రామాన్ని మండల కేంద్రంగా మార్చడంతో పాటు ఖిల్లాను అభివృద్ధి చేయాలని విన్నవించారు. సర్పంచ్ ఎద్దం డి షర్మిలా ప్రకాశ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేశ్‌గౌడ్, జడ్పీటీసీ పిట్టల కరుణా రవీందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, జిల్లా కోఆప్షన్ సభ్యు డు షాబీర్, మండల కో ఆప్షన్ సభ్యుడు షరీఫ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కాసారపు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీటీసీలు తిరుపతినాయక్, పట్టెం శారద లక్ష్మీనారాయణ, పండుగ గంగవ్వ నర్స య్య, సర్పంచ్ జినుక సంపత్,నాయిని ప్రసాద్, నాయకులు సోమినేని తిరుపతి పాల్గొన్నారు.
మండలంలోని చింతకుంటలో పూర్తయిన రైతు భవనం, సమీకృత మార్కెట్‌ను మంత్రి గం గుల కమలాకర్ ప్రారంభించారు. అలాగే కరీంనగర్ కమిషనరేట్‌లోని కొత్తపల్లిలో రూ.1.70 కోట్లతో నిర్మించనున్న భరోసా కేంద్రానికి శనివారం మంత్రి, సీపీ సత్యనారాయణగౌడ్‌తో కలిసి భూ మి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై వేధింపులు, హింసాత్మక సంఘటనలు జరిగిన సందర్భంలో భరోసా కేంద్రం వారికి అండగా నిలిచి రక్షణ కల్పించడంతో పాటు చేయూతనందిస్తుందన్నారు. రెండస్తుల్లో నిర్మించనున్న ఈ భవనం 6 నెలల వ్యవధిలో పూర్తవుతుందని తెలిపారు. కౌన్సిలర్ జెర్రిపోతుల అంజలీ శ్రీకాంత్, అడిషనల్ డీసీపీ పరిపాలన జి చంద్రమోహన్, ఏసీపీలు కరుణాకర్‌రావు, తుల శ్రీనివాసరావు, ప్రతాప్, సీఐ విజ్ఞాన్‌రావు, ఆర్ఐ కిరణ్‌కుమార్, కొత్తపల్లి ఎస్ఐ ఎల్లయ్యగౌడ్ పాల్గొన్నారు.