Peddapally | పెద్దపల్లి, నవంబర్ 7 : పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పెద్దపల్లి డీఎంవో పడిగెల ప్రవీణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా డీఎంవోకు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, డైరెక్టర్లు, అడ్తిదారులు, మార్కెట్ కమిటీ సిబ్బంది ప్రవీణ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.