కరీంనగర్ రూరల్, అక్టోబర్ 26: ‘పోరాడుదాం.. గెలుద్దాం’ ‘బ్రెస్ట్ క్యాన్సర్‌ను నిర్మూలిద్దాం’ అంటూ ప్రతిమ వైద్య కళాశాల విద్యార్థులు, వైద్య సిబ్బంది నినదించారు. ప్రతిమ హాస్పిటల్, ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో డిపార్ట్మెంట్ జనరల్ సర్జన్ ఆధ్వర్యంలో ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ తీశారు. నగరంలోని గీతాభవన్ నుంచి కలెక్టరేట్ మీదుగా అంబేద్కర్ స్టేడియం వరకు ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా ‘రొమ్ము క్యాన్సర్‌ను ఓడిద్దాం’ అంటూ నినాదాలు చేశారు.
ఆ తర్వాత క్యాన్సర్ నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జాన్ ఇజ్రాయిల్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కిషన్‌రెడ్డి, సీఏవో రామచంద్రారావు, డాక్టర్ అరుణ్, కటారి, హెచ్‌వోడీ ఆఫ్ జనరల్ సర్జన్ డాక్టర్ సత్యప్రభ, హెచ్ఓడీ ఆఫ్ గైనకాలజీ డాక్టర్ గీతారెడ్డి, ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ డాక్టర్ ప్రణయ్, వేణుకిషన్‌రావు, తదితరులు పాల్గోన్నారు.