సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 31 : కార్మికులకు రావాల్సిన పది శాతం యారన్ సబ్సిడీ అందించాలని, ప్రభుత్వం ఉత్పత్తి చేస్తున్న చీరలకు కూలీ నిర్ణయింలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నామని సీఐటీయూ తెలంగాణ పవర్లూమ్ వరర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డిమాండ్ స్పష్టం చేశారు. పవర్లూమ్, వార్పిన్, వైపని కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల బీవైనగర్‌లోని అమృత్లాల్ శుక్లా కార్మిక భవనంలో సోమవారం పవర్లూమ్, వార్పిన్, వైపని రంగాల ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఉత్పత్తి చేయిస్తున్న మహిళా పొదుపు సంఘాల చీరల ఉత్పత్తి పనులు ప్రారంభమైనా.. ఇప్పటివరకు పవర్‌లూం, వార్పిన్, వైపని కార్మికులకు కూలి నిర్ణయించకపోవడంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం నెలకొన్నదన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరలకు ఒక మీటర్‌కు కూలీ రూ.5.25 పైసలు యారన్ సబ్సిడీ కింద ఒక మీటర్‌కు రూ.1.42 పైసలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ చీరలకు సంబంధించి కార్మికులకు ఎంత కూలీ తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వరర్ టూ ఓనర్ పథకానికి సంబంధించి షెడ్ల నిర్మాణం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా ఈ పథకాన్ని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. కార్మికుల సమస్యలు పరిషరించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. మంగళవారం ఉదయం 9గంటలకు బీవైనగర్‌లోని సీఐటీయూ కార్యాలయం వద్దకు పవర్‌లూం, వార్పిన్, వైపని కార్మికులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పవర్లూమ్ వరర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, ఉపాధ్యక్షుడు గుండు రమేశ్, వార్పిన్ వరర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, ఉడుత రవి, వైపని వరర్స్ యూనియన్ అధ్యక్షులు కుమ్మరికుంట కిషన్, ఒగ్గు గణేశ్, సబ్బని చంద్రకాంత్, భాస శ్రీధర్, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, కమలాకర్, పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.