sultanabad | సుల్తానాబాద్ రూరల్ ఆగస్టు 28: నిత్యం వందలాది వాహన రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై గుంత పడింది. ఆ గుంతతో ప్రమాదం పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని తొగ రాయి నుంచి జెండాపల్లి గ్రామాల మధ్య రోడ్డులో నీళ్లు వెళ్లేందుకు పైపు వేశారు.
కొంత కాలం క్రితం పైపు రంద్రం పడి పెద్ద గుంతగా ఏర్పడింది. కనుకుల ,మారుతి నగర్, రాముని పల్లి, మంచారామి, తొగర్రాయి గ్రామాల ప్రజలు నిత్యం ఈ దారి వెంటనే దూర భారం తగ్గించేందుకు కదంబపూర్, గట్టేపల్లి, నీరుకుల గ్రామాల మీదుగా గర్రెపల్లి కి వెళ్తుంటారు. రాత్రి వేళలో ప్రయాణం చేయడం వల్ల గుంతను గమనించకుండా వెళ్తే ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు పలుమార్లు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంత పుడ్చి వేయించాలని కోరుతున్నారు.