Hanmanthunipet | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 26 : పెద్దపల్లి మండలం హన్మంతునిపేట సమ్మక్క-సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గా పోల్సాని సుధాకర్ రావు ను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపల్లి మండలంలోని హన్మంతునిపేట, ధర్మాబాద్, రాంపల్లి శివారులోని సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద సమావేశమైన కమిటీ సభ్యులంతా మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు కమిటీని ఎన్నుకున్నారు.
చైర్మన్ గా హన్మంతునిపేటకు చెందిన పొల్సాని సుధాకర్ రావు, వైస్ చైర్మన్ గా కందుల సదయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో జాతర కమిటీ సభ్యులు, మూడు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.