Political training | పెద్దపల్లి, అక్టోబర్ 19 : సామాజిక, రాజకీయ చైతన్యం కల్పించేందుకు సమగ్ర ప్రణాళికతో ఈ నెల 24న యాదవులకు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘాల కన్వీనర్ సౌగాని కొమురయ్య యాదవ్ వెల్లడించారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆదివారం అఖిల భారత యాదవ మహా సభ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేకల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక సంఖ్యలో యాదవులను పొటీలో నిలిపి గెలిపించుకుంటామని పేర్కొన్నారు. యాదవ సమాజం రాజకీయంలో కాస్తా వెనుకబడి ఉందని, రాజకీయాలను శాసించే దిశగా యాదవ సమాజం ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు. యాదవులకు సమాజంలో మంచి పేరున్నప్పటికీ రాజకీయ మెలుకవలు, ఎత్తులు తెలియక రాణించటం లేదన్నారు. రాజకీయంలో రాణించాలనే యాదవ ఔత్సాహికులకు ఎన్నికల్లో గెలువటం ఎలా? అనే విషయమై మోటివేటర్సుతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాదర్ గూడెంలోని అరబింద పామ్హౌజ్లో ఈనెల 24న ఉదయం 10నుండి సాయంత్రం 4గంటల వరకు ఒక రోజు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీపడాలనుకుంటున్న యాదవ నాయకులు అధిక సంఖ్యలో శిక్షణ తరగతుల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలోని యాదవులంతా ఎకమై ఎక్కడ యాదవ బిడ్డ పోటి చేసిన గెలిపించుకోవాలని కోరారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కమిటీ సభ్యులం ఆదివారం మద్యం, మాంసం ముట్టమని తీర్మాణం చేసుకున్నామని, అలాగే ప్రతీ యాదవ బిడ్డ ఆదివారం మద్యం సేవించవద్దని, మాంసం తినోద్దని విజ్ఞప్తి చేశారు.
అనంతరం రాజకీయ శిక్షణ శిబిరం కర పత్రాన్ని విడుదల చేశారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సందనవేన రాజేందర్, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మారం తిరుపతియాదవ్, దుండు రాజయ్యయాదవ్, తమ్మడబోయిన ఓదెలు, కుమార్ యాదవ్, నాగారపు సత్యనారాయణ, చిలారపు పర్వతాలు, మేకల రాజేందర్, అట్ల సాగర్, రాజం మహంతకృష్ణ, పోసాని శ్రీనివాస్ యాదవ్, ఉప్పరి శ్రీనివాస్ యాదవ్, బత్తిని లక్ష్మన్, గొడుగు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.