BRS | ఓదెల, ఆగస్ట్ 14 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేసేందుకు గురువారం ప్రయత్నించారు. గమనించిన పోలీసులు ఈ ఘటనను అడ్డుకున్నారు. కాగజ్‌నగర్‌లో పోడు రైతులకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దాసరి ఉషను పోలీసులు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయబోవుగా పోలీసులు అడ్డుపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బీరం రవి, బండా నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.