Police services | తిమ్మాపూర్, అక్టోబర్1: పోలీస్ సేవలు నిత్యం సవాలతో కూడుకున్నవని.. అన్ని సవాళ్లను ఎదుర్కొని గొప్ప అని తిమ్మాపూర్ సీఐ సదన్ కుమార్ అన్నారు. ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ లో అడ్మిన్ ఎస్సై రవీందర్ రెడ్డి రిటైర్మెంట్ కాగా.. ఆయనను ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ తో కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. భవిష్యత్తు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఏఎస్ఐ గా చేస్తున్న వెంకటేశ్వర్లు ఎస్సై గా పదోన్నతి పొంది సిద్దిపేట కమిషనరేట్ కు బదిలీ కాగా ఆయననూ సత్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బంది ఘనంగా వేడుకలు జరిపారు. జ్ఞాపకాల అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.