Police parade | వీణవంక, ఆగస్టు 23 : వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో శనివారం ఎస్ఐ ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, జెండా ఊపి కవాతు ప్రారంభించారు. కాగా సుమారు 60 మంది పోలీసులు గ్రామం శివారు నుండి గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ కవాతు చేశారు.
అనంతరం బస్టాండ్ కూడలి వద్ద జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కరీంనగర్ సీనీ గౌస్ ఆలం ఆదేశాల మేరకు రానున్న గణేష్, దుర్గామాత నవరాత్రులు, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పోలీసు కవాతు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టపీ భగీల్, జమ్మికుంట, ఇల్లందకుంట ఎస్సైలు నాగరాజు, క్రాంతి, మండల మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.