Missing child | ఫర్టిలైజర్ సిటీ, మే 31: గోదావరిఖని పట్టణంలోని గాంధీ చౌరస్తాలో తప్పిపోయిన 5 సంవత్సరాల ఓ పాపను గోదావరిఖని 1టౌన్ బ్లూ క్లోట్స్ పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు తప్పిపోయిన పాప సమాచారాన్ని ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది బ్లూ క్లోట్స్ సిబ్బంది కి సమాచారం అందించగా బ్లూ క్లోట్స్ సిబ్బంది వెంటనే స్పందించి చిన్న పాప తల్లితండ్రుల వివరాలు గుర్తించడం కోసం ఫొటో ను సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేశారు.
కాగా పాప బ్లూ క్లోట్స్ పోలీస్ సిబ్బంది వద్ద ఉన్నదనే సమాచారం తో పాప తల్లితండ్రులు పోలీస్ సిబ్బంది ని సంప్రదించారు. కాగా ఆ పాపని తల్లితండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన ఆ చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించిన బ్లూ క్లోట్స్ సిబ్బంది తిరుపతి, నవీన్ లను 1టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. తమ పాప ను అప్పగించిన 1 టౌన్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.