గోదావరిఖని : గోదావరిఖని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత పది నెలల క్రితం జరిగిన హత్యాయత్నం ( Attempt Murder ) కేసును ఎట్టకేలాగు పోలీసులు చేధించారు. పట్టణంలోని కోదండరామాలయ సమీపంలో సింగరేణి క్వార్టర్లో ఆర్ఎఫ్సీఎల్ అవుట్ సోర్సింగ్, ఫిజీషియన్ అసిస్టెంట్ యశ్వంత్( Yashwant) గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్పడి హత్యాయత్నం చేశారు.
బాధితుడి భార్య ప్రతిమ పిర్యాదు మేరకు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. పలు కోణాల్లో విశ్లేషించిన పోలీసులు కుటుంబ సభ్యులు, బంధువులను విచారించారు. యశ్వంత్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో నిందితుడి ముఖం రికార్డు కావడంతో దాని ఆధారంగా విచారణ చేపట్టామని వివరించారు.
ప్రధాన నిందితుడు కన్నం ఛత్రపతిని అతడి ఇంటి వద్ద అదుపులోకి విచారించి అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామని ఇన్స్పెక్టర్ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. నల్లగుల ప్రసాద్ అలియాస్ సన్నీ , అనవేని సాయి తేజను అరెస్టు చేశామన్నారు.కన్నం సంధ్య పరారీలో ఉందని పేర్కొన్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడానికి కృషిచేసిన క్రైమ్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, సదానందం , శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రమేష్ ,మధుకర్, శ్రీనివాస్‌ను సీఐ అభినందించారు.