Police check post | మల్లాపూర్ జులై 30: జగిత్యాల జిల్లా సరిహద్దు గ్రామమైన మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ శివారులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోలీస్ చెక్ పోస్ట్ ఫోటో సోషల్ మీడియా వేదికగా చెక్కర్లు కొడుతుంది. వివరాలలోకి వెళ్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్ వైపు వెళ్లే గుర్తు తెలియని వ్యక్తులు తమ కారులోంచి సదరు చెక్ పోస్ట్ గోడ పైన ఉన్న ఖాళీ మద్యం సీసాలు కనిపిస్తున్న ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో పోలీస్ శాఖ సంబంధించిన చెక్‌పోస్టులో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగడం ఏంటని పలువురు నేటిజెన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై స్థానిక ఎస్సైని వివరణ కోరగా చెక్ పోస్ట్ పరిసర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా ఓ మతి స్థిమితం లేని వ్యక్తి సంచరిస్తున్నాడని, రాత్రిపూట వర్షాకాలం దృష్ట్యా అక్కడే సేదతిరి తాను తెచ్చుకున్న ఖాళీ సీసాలను అలా గోడపై పెట్టి ఉండవచ్చని అనుమానం ఉందని తెలిపారు.