Sunstroke | తిమ్మాపూర్,ఏప్రిల్25: ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది కొట్టిందంటే చాలు అడుగు భయటపెట్టలంటే భయమేస్తోంది. గురువారం రోజంతా కూలీ పనులకు వెళ్లిన యువకుడు వడదెబ్బతో ఇంటికి వచ్చి నీరసమయ్యాడు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొలంపల్లి గ్రామానికి చెందిన రెడ్డి రామచంద్రం(26) కూలీ పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో రోజు వారిలాగా గురువారం సైతం పనులకు వెళ్లి రోజంతా ఎండకు పనిచేసే ఇంటికి వచ్చాడు. అనంతరం రాత్రి సమయంలో సమస్యలు పడిపోవడంతో ఆందోళన కుటుంబ సభ్యులు స్థానిక గ్రామీణ వైద్యుడి వద్ద చికిత్స చేయించారు. శుక్రవారం ఉదయం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తీసుకెళుతుండగా పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.