కమాన్చౌరస్తా, సెప్టెంబర్ 8 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7796 అప్లికేషన్లు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మెరిట్ జాబితాను ప్రభుత్వం డీఈవోకు పంపింది. దానిని శనివారం అధికారులు ప్రచురించనున్నారు. ఇందు లో భాగంగా, దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులకు ఎవరికి వారు తమ పాయింట్లు చూసుకునేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.
ఉపాధ్యాయులు తమ ఫోన్ నెంబర్, ట్రెజరీ ఐడీ ద్వారా తమ పాయింట్లు తెలుసుకోవచ్చు. ఇందులో వచ్చిన పాయింట్లను దృష్టిలో ఉంచుకుని మెరిట్ జాబితా ఉండనుంది. ఈ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.