కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూలై 22 : హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం కవి అన్నవరం దేవేందర్‌కు దాశరథి సాహిత్య పురసారాన్ని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ప్రదానం చేశారు. 1,01,116 నగదు పురసారంతోపాటు జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా పురసార గ్రహీత తల్లి అన్నవరం కేదారమ్మ, సతీమణి ఏదునూరి రాజేశ్వరిని నిర్వాహకులు వేదికపైకి పిలిచి ఆహ్వానించి సతరించారు.
ఈ సందర్భంగా దాశరథి పురసారం అందించినందుకు అన్నవరం దేవేందర్ ధన్యవాదాలు తెలిపారు. పురసార స్వీకారం తర్వాత అన్నవరంను బంధుమిత్రులు ఘనంగా సన్మానించారు.