Pochamma Bonalu | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 13: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎల్లమ్మ తల్లి పట్నాల సందర్భంగా ఆదివారం పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటిల్లి పాది మహిళలు నెత్తిన బోనాలతో పోచమ్మ తల్లి సల్లంగా చూడు తల్లి అంటూ దేవాలయానికి చేరుకుని నైవేధ్యం పెట్టి ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు.
గౌడసంఘం రాష్ట్ర నాయకుడు, కార్మిక సంఘంనేత, ఏగోళపు చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ బోనాల ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలతో పెద్దపల్లి నియోజకవర్గం, మండలంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషం, పాడి పంటలతో విలసిల్లుతూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బాలసాని శ్రీనివాస్ గౌడ్, పులి రవి గౌడ్, బాలసాని రాజయ్య గౌడ్, జక్కుల రాజు గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు కొయ్యడ రాజయ్య గౌడ్, సిలారపు రమేష్ యాదవ్, దాసరి దేవయ్య యాదవ్ , హరికృష్ణ, కొయ్యడ పురుషోత్తం గౌడ్, కారె విజ్జాలు, శేషగిరి రవి అధిక సంఖ్యలో భక్త్తులు పాల్గొన్నారు.