Pochamma Bonalu | రుద్రంగి, జూన్ 12: రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర మున్నూరు కాపు సంఘాల ఆధ్వర్యంలో మహిళలు గురువారం బోనాలు తీసుకెళ్ళి పోచమ్మ బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోచమ్మకు నైవేద్యం సమర్పించారు. ఇంటి నుండి మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుల్లతో సంఘ సభ్యులు, యువకులు నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ వర్షాలు సంమృద్ధిగా కురిసి పడి, పశు సంపదతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ పోచమ్మకు నైవేద్యం, ఓడి బియ్యం సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, యువకులు, మహిళలతో పాటు తదితరులు పాల్గొన్నారు.