PM Narendra Modi | ధర్మారం,సెప్టెంబర్ 17: ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకలను బుధవారం బిజెపి మండల శాఖ అధ్యక్షుడు తీగుళ్ల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ స్థానిక అయ్యప్ప స్వామి దేవస్థానంలో పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు , అర్చన చేయించారు. పార్టీ గద్దెపై జాతీయ జెండాను ఎగురవేయడం ఎగురవేశారు .
అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి కన్నం అంజయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు యాళ్ల తిరుపతిరెడ్డి ,జనరల్ సెక్రెటరీ కుందేళ్ళ కిరణ్ కుమార్, ఉపాధ్యక్షుడు సామంతుల కిరణ్, పార్టీ సీనియర్ నాయకులు సందనవేని లక్ష్మణ్, ఐటీ సెల్ కన్వీనర్ కొక్కుల బాలకృష్ణ,ఎస్టి మోర్చా మండల అధ్యక్షులు రవి నాయక్, నాయకులు గోనె సాయి, దేవి రాయలింగు, రేండ్ల శ్రీనివాస్, గుండ సత్యనారాయణ రెడ్డి, గుండా వెంకట్ రెడ్డి,ఆకుల లచ్చన్న, చీకట్ల శేఖర్, మందపల్లి సాయిరాం, బాల్ రెడ్డి,పెసరి లచ్చన్న తదితరులు పాల్గొన్నారు.