కార్పొరేషన్, జూన్ 29: కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌ను విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశా రు. కరీంనగరంలోని శ్వేత హోటల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మంత్రి మాట్లాడారు. జిల్లాను అన్ని రంగా ల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పని చేస్తున్నదని చెప్పారు. 2014లో కేసీఆర్ సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వా త తొలి పర్యటన కరీంనగర్‌లోనే చేశారని, మొదట నిధులు ఇచ్చింది కూడా నగరానికేనని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన జీవో 4 తో నగర రూపురేఖలు మారాయని తెలిపారు. ఒకేసారి 110 కోట్ల మంజూరు చేయడంతో ప్రధాన రహదారులన్నింటినీ అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. నగరాన్ని అనుకొని ఉన్న 24 టీఎంసీల మానేరు జలాశయా న్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన గత పాలకులకు రాలేదని, కానీ స్వరాష్ట్రం లో అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అంటే ఎంతో మంది రాజకీయ నాయకులు వ్యంగ్యం గా మాట్లాడారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అదే మానేరు నది వద్ద జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారని చెప్పా రు.
ఎవరో మెచ్చుకుంటారని, కితాబిస్తారని అ భివృద్ధి చేయడం లేదని, భావితరాల భవిష్యత్ కోసం అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో నగర రూపురేఖలు మార్చి హైదరాబాద్ తర్వాత రెండో గొ ప్ప నగరంగా తీర్చిదిద్దామన్నారు. మానేరు రివ ర్ ఫ్రంట్ మరింత ఆకర్షణీయంగా ఉండాలని ఆలోచనతోనే కేబుల్ బ్రిడ్జిని నిర్మించామన్నా రు. ప్రపంచంలోనే మూడోదైన బిగ్ ఓ ఫౌంటెయిన్ పనులు ఇప్పటికే ప్రారంభించామని చె ప్పారు.
310 కోట్లతో రివర్ ఫ్రంట్ పనులు, మరో 100 కోట్లతో పర్యాటక అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మానేరు డ్యాం నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే తట్టుకునేలా చెక్ డ్యాం, ఆఫ్ బరాజ్ నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఆగస్టు కల్లా మొదటి దశ పనులను పూర్తి చేసి 12 అడుగుల లోతు ఉండేలా నీటిని నిలుపుతామన్నారు. ప ర్యాటకానికి కేటాయించిన 100 కోట్ల నిధుల నుంచి 72 కోట్లతో బిగ్ వో ఫౌంటెయిన్ నిర్మిస్తున్నామని, 10 కోట్లతో స్పీడ్ బోట్లు, మరో 10 కోట్లతో ఎల్లమ్మ దేవాలయం వద్ద ఎంట్రె న్స్ ప్లాజా నిర్మిస్తామన్నారు.
మానేరు రివర్ ఫ్రంట్ కోసం గతంలో ఇచ్చిన 410 కోట్లకు అదనంగా సీఎం కేసీఆర్ మరో 250 కోట్లు కే టాయించారని వెల్లడించారు. ఈ నిధులతో రి వర్ ఫ్రంట్‌కు సరికొత్త సొబగులు, అందాలను తేవాలన్న ఆలోచనతో ముగ్గురు రాజకీయ నా యకులు, ముగ్గురు అధికారులతో కూడిన ఓ డెలిగేషన్ బృందం సింగపూర్, సీయోల్, ఒసో లో అధ్యయనం చేసేందుకు వెళ్తున్నదని చెప్పా రు. బృందంలో తనతోపాటు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రణాళికా సంఘం ఉ పాధ్యక్షుడు వినోద్‌కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ప్రిన్సిపల్ సెకట్రరీ రజత్‌కుమార్, పర్యాటకశా ఖ ఎండీ ఉన్నారన్నారు.
గురువారం సాయం త్రం హైదరాబాద్ నుంచి వెళ్లి సింగపూర్తోపా టు సౌత్ కొరియాలోని సియోల్, ఓసోలో పర్యటించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు లో చేపడుతున్న బిగ్ ఓ ఫౌంటెయిన్ ఒసోలోనే ఉందని, అక్కడ ఉన్న దానికంటే ఇక్కడ ఆధునిక టెక్నాలజీని తీసుకువచ్చేందుకు ప్రయత్నా లు చేస్తామన్నారు. ఒసో రివర్ ఫ్రంట్‌లోని ఎలిమెంట్లను కరీంనగర్ తేవాలన్నదే తమ లక్ష్యమన్నారు.
సింగపూర్‌లో అమెరికన్ టెక్నాలజీతో నిర్మించిన యూనివర్సల్ స్టూడియోని అధ్యయ నం చేస్తామన్నారు. గుజరాత్‌లోని సబర్మతీ రి వర్ ఫ్రంట్ కంటే అధునాత నంగా, మన రాష్ర్టానికే గర్వకారణంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మధు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.